చెవిలో ఇయర్ ఫోన్స్.. రైలు ఢీకొని యువతి మృతి
ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మహిళ మృతి చెందారు.

ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మహిళ మృతి చెందారు.
హైదరాబాద్ : ఇయర్‌ఫోన్స్ ఓ మహిళ ప్రాణం తీశాయి. ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో యువతి మృతి చెందారు. నాంపల్లి రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన రేఖా మహల్ (25) టెలిఫోన్ భవన్ ఎదుట హాస్టల్‌లో ఉంటున్నారు. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారు.
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్
మార్చి 7వ తేదీ గురువారం ఉదయం రేఖా మహల్ జిమ్‌కు వెళ్లింది. తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు ఖైరతాబాద్‌లోని రైలు పట్టాలు దాటుతోంది. ఈ క్రమంలో చెక్‌పోస్టు దాటి లోపలి వైపు నిల్చుంది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది. బేగంపేట నుంచి నాంపల్లి వైపు రైలు వెళ్లగానే లైన్ క్లియర్ అయ్యిందని ముందుకు వెళ్లింది.
ఆ సమయంలో నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న MMTSను గమనించకపోవడంతో రైలు ఆమెను ఢీకొంది. యువతి తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం స్థానికులు గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుక పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు