Facebook Friend: ఫేస్‌బుక్‌ ప్రేమికుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత.. యూపీలో దారుణహత్య..

ఫేస్‌బుక్‌ ప్రియుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత యూపీలో దారుణ హత్యకు గురైంది. మాయమాటలతో తనదగ్గరకు పిలిపించుకున్న ప్రియుడే హతమార్చాడు.

Facebook Friend: ఫేస్‌బుక్‌ ప్రేమికుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత.. యూపీలో దారుణహత్య..

Brutal murder

Updated On : November 13, 2022 / 11:36 AM IST

Facebook Friend: ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో వివాహిత ప్రేమలో పడింది. అతన్ని వెతుక్కుంటూ భర్త, పిల్లలను వదిలి వెళ్లింది. తీరా ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ కు చెందిన ఉస్మా బేగం(32) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాన్సువాడలో నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా కొంతకాలంగా ఉస్మా బేగం పుట్టింట్లోనే ఉంది. పెద్దలు రాజీ కుదర్చడంతో ఈనెల 4న భర్త నివాసముండే బాన్సువాడకు వెళ్లింది. రెండు రోజుల తరువాత కనిపించక పోవటంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Rajasthan Gang Rape : దొంగతనానికి వచ్చి దారుణం.. భర్తను బంధించి అతడి ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేసిన దొంగలు

మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. గత రెండు రోజుల క్రితం యూపీలో ఉస్మాబేగం హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. యూపీలోని అమ్రోహా జిల్లాలో గజరౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ మేట్ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో మూడు రోజుల కిందట మహిళ మృతదేహాన్ని యూపీ పోలీసులు గుర్తించారు. షెహజాద్ అనే యువడిపై అనుమానంతో విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉస్మా బేగం ఫేస్ బుక్ లో పరిచయమైందని, పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలిపాడు.

Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన మినీ బస్సు.. 22 మంది మృతి

కొద్దిరోజుల క్రితం తన సూచన మేరకు ఉస్మాబేగం తన కుటుంబాన్ని వదిలేసి తన వద్దకు వచ్చిందని నిందితుడు తెలిపాడు. అయితే, వచ్చిన దగ్గర నుంచి పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కోపంతో ఆమెను ఇటుకతో తలపై చితకబాది హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. ఆ తరువాత కంపెనీ ఆవరణలో ఓ మూలన మహిళ మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో హంతకుడు వెల్లడించాడు. యూపీ పోలీసుల సమాచారం మేరకు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులు యూపీకి వెళ్లారు.