Google Search: హత్య కేసులో కీలక ఆధారం గూగుల్.. అడ్డంగా దొరికిపోయిన భార్య
గూగుల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసుని చేధించారు. హంతకురాలిని ఇట్టే గుర్తించారు. హత్య చేసింది ఆమె అని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. భార్యే తన భర్తను చంపేసింది. ఆ తర్వాత నాటకాలు ఆడింది. కానీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ కారణంగా ఆమె అడ్డంగా బుక్కయింది.

Google Search History
Google Search History Murder Case : గూగుల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసుని చేధించారు. హంతకురాలిని ఇట్టే గుర్తించారు. హత్య చేసింది ఆమె అని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. భార్యే తన భర్తను చంపేసింది. ఆ తర్వాత నాటకాలు ఆడింది. కానీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ కారణంగా ఆమె అడ్డంగా బుక్కయింది.
తబస్సుమ్, ఆమిర్ దంపతులు. హర్దా జిల్లాలోని కేదీపూర్ లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న తన భర్త ఆమిర్ హత్యకు గురయ్యాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇంటిని పరిశీలించి దొంగలు ఆమిర్ ను హత్య చేసి ఉంటారని తొలుత భావించారు.
విచారణ సాగుతున్న కొద్దీ ఆమిర్ భార్యే అసలు నిందితురాలనే అనుమానం పోలీసులకు కలిగింది. ఆమె ఫోన్‌ను పరిశీలించగా ఇర్ఫాన్ అనే వ్యక్తికి ఎక్కువ సార్లు కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. అనంతరం ఆమె గూగుల్ హిస్టరీని పరిశీలించగా.. `ఓ వ్యక్తిని సులభంగా చంపడం ఎలా?, శవాన్ని మాయం చేయడం ఎలా?` అనే అంశాల గురించి ఎక్కువ సార్లు శోధించినట్టు తేలింది.
దీంతో ఆమెను విచారించగా.. నిజం కక్కేసింది. తన ప్రియుడు ఇర్ఫాన్ సాయంతో తనే భర్తను చంపినట్టు అంగీకరించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే భర్తను హత్య చేసినట్టు చెప్పింది. దీంతో పోలీసులు ఆమెపై, ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. అలా..గూగుల్ హిస్టరీ ఆధారంగా పోలీసులు ఈ మర్డర్ కేసులో మిస్టరీని చేధించారు.