ఆకతాయిల వేధింపులకు యువతి బలి : కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య

రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకుల వేధింపులు తాళ లేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 06:43 AM IST
ఆకతాయిల వేధింపులకు యువతి బలి : కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య

Updated On : January 30, 2020 / 6:43 AM IST

రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకుల వేధింపులు తాళ లేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకుల వేధింపులు తాళ లేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గంగరావుపేట మండలం గజసింగవరంలో ఇద్దరు యువకులు వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతికి కారణమైన శ్రీకాంత్ ను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

గజసింగవరంకు చెందిన లావణ్యను శ్రీకాంత్, రవి ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ చేస్తున్నారు. రవి అనే యువకుడు వాయిస్ మెసేజ్ చేస్తూ ప్రేమించమని వేధిస్తుంటే, వివాహితుడైన శ్రీకాంత్ లావణ్యను ఫోన్ ద్వారా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇద్దరి వేధింపులు కూడా ఆమెకు భయాందోళనకు గురిచేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లావణ్య.. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ వారి పద్ధతి మాత్రం మారలేదు.

లావణ్యకు శ్రీకాంత్, రవి యాథావిధిగా ఫోన్ ద్వారా వేధింపులు కొనసాగుతున్నాయి. వారి వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో లావణ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన యువతని చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

అంతకముందు మృతురాలు లావణ్య ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం ఇద్దరు యువకులు శ్రీకాంత్, రవి ఫోన్ చేసి ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. వారి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడవల్సివచ్చిందని మరణ వాంగూల్మం ఇచ్చింది. మృతురాలి మరణ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ కొనసాగిస్తున్నారు.