10th క్లాస్ పాస్ అయితే చాలు : వాలంటీర్ల పోస్టులకు కనీస అర్హత

గ్రామ వాలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొదట ఇంటర్ ఉండేది. తాజాగా దీనిని పదో తరోగతికి తగ్గిస్తూ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వాలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు కనీస విద్యార్హతగా మైదన ప్రాంతంలో ఇంటర్ మీడియట్, గిరిజన ప్రాంతంలో పదో తరగతిగా ఉంది.
అప్పట్లో మొత్తం లక్షా 92 వేల 964 మంది గ్రామ వాలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. లక్షా 83 వేల 290 మంది విధులలో చేరారు. మిగిలిన 9 వేల 674 పోస్టులకు మైదాన, గిరిజన ప్రాంతం రెండింటిలోనూ పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
> నవంబర్ 01న ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు.
> ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా నవంబర్ పదో తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
> నవంబర్ 16 నుంచి 20 మధ్య మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
> ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 22వ తేదీ కల్లా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
> అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు.
> కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 01 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.
Read More : 9 వేల 674 గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్