Admissions : ఇగ్నో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, టూరిజం, రూరల్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఫుడ్ ప్రాసెసింగ్, డైయిరీ, బీఈడీ, డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎంసీఏ, బీసీఏ, పీజీడీసీఏ, మాస్టర్ ఆఫ్ సోషియాలజీ తదితర విభాగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Ignou (1)
Admissions : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు చివరి తేది సమీపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం మొత్తం 17 రకాల డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తుంది. వాటిలో 37 పీజీ కోర్సులు, 16 డిప్లొమా, 34 పీజీ డిప్లొమా, 8 పీజీ సర్టిఫికెట్, 37 సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, టూరిజం, రూరల్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఫుడ్ ప్రాసెసింగ్, డైయిరీ, బీఈడీ, డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎంసీఏ, బీసీఏ, పీజీడీసీఏ, మాస్టర్ ఆఫ్ సోషియాలజీ తదితర విభాగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా జులై 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకోసం సంప్రదించాల్సిన చిరునామా ; ఇగ్నో ప్రాంతీయ కేంద్రం, ఎం-5 బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, మనోరంజన్ కాంప్లెక్స్, గాంధీభవన్ మెట్రో స్టేషన్ పక్కన ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; వెబ్‌సైట్: www.ignou.ac.in పరిశీలించగలరు.