AIIMS Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్‌) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 33 సంవత్సరాలు మించకూడదు.

AIIMS Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

aiims deoghar

Updated On : October 7, 2023 / 2:21 PM IST

AIIMS Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) దియోఘర్‌లో వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Kharif Rice Crop : ఖరీఫ్ వరి పంటలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్‌) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 33 సంవత్సరాలు మించకూడదు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

READ ALSO : Bad Breath : నోటి దుర్వాసనకు విటమిన్ డి లోపం ఒక కారణమా?

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే అన్ రిజర్వుడ్ కేటగిరి రూ.3000. ఓబీసీ రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల్లోగా అనగా 18.10.2023. పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, నాల్గవ అంతస్తు, AIIMS దేవిపూర్, పర్మినెంట్ క్యాంపస్ దియోఘర్ -814152(జార్ఖండ్). పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsdeoghar.edu.in/