అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు!

అమెజాన్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు ప్రకటించింది.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 01:26 AM IST
అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు!

Updated On : March 11, 2020 / 1:26 AM IST

అమెజాన్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు ప్రకటించింది.

అమెజాన్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 27 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు ఇచ్చింది. మంగళవారం విద్యార్థినులకు ఆఫర్‌ లెటర్లను కూడా పంపించింది. 

మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలోని సెయింట్‌ మార్టిన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న మధురిమ, శిరీషలకు ఈ ఆఫర్‌ లభించింది. కళాశాలలో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూల్లో వీరికి ప్లేస్‌మెంట్స్‌ లభించాయి.

కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ పాత్ర విద్యార్థినులకు నియామక పత్రాలు అందజేశారు. చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌ ఈ సందర్భంగా విద్యార్థినులను అభినందించారు 

See Also | వేలానికి రాజీవ్ స్వగృహ ఇళ్లు