AP PGCET 2025 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

AP PGCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి.

AP PGCET 2025 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Ap pgcet 2025 Results Released

Updated On : June 26, 2025 / 1:57 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరానికి గాను మొత్తం 21,995 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా అందులో 19,488 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 88.6 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు. ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఖరారు చేయనున్నారు అధికారులు. అభ్యర్థులు సాధించిన ర్యాంక్ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు.

ఏపీ పీజీసెట్‌ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PGCET/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్నిట్ చేయాలి.
  • తరువాత ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

ఏపీ పీజీసెట్‌ ర్యాంక్ కార్డు ఈజీగా ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PGCET/ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఇంటెర్ట్ చేసి సబ్మిట్ పై నొక్కాలి.
  • మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • దానికి ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకొని కాపీని పొందవచ్చు.
  • సీట్ పొందే ప్రాసెస్ లో ఈ ర్యాంక్ కార్డు చాలా అవసరం. అందుకే జాగ్రత్తగా ఉండండి.