బీటెక్ 3వ సెమిస్టర్ లో ఫిలాసఫీ సబ్జెక్టు

  • Published By: venkaiahnaidu ,Published On : September 26, 2019 / 04:10 PM IST
బీటెక్ 3వ సెమిస్టర్ లో ఫిలాసఫీ సబ్జెక్టు

Updated On : September 26, 2019 / 4:10 PM IST

బీటెక్,ఎంటెక్ విద్యార్థులకు 3వ సెమిస్టర్ లో భాగంగా “ఫిలాసఫీ”సబ్జెక్టును ప్రవేశపెట్టింది తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ. వచ్చే ఏడాది బ్యాచ్ నుంచి  ఇది అమలవుతుందని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎమ్ కే సూరప్ప తెలిపారు.

అయితే ఇది తప్పనిసరి అని తాము చెప్పబోమని,విద్యార్థులు తమకు ఇష్టముంటేనే ఈ సబ్జెక్ట్ ను తీసుకోవచ్చని తెలిపారు. తప్పనిసరి రూల్ ను త్వరలోనే సవరిస్తామని తెలిపారు. అన్నా యూనివర్శిటీ కోర్సు ప్రకారం..ఉపనిషత్తులు,భగవద్గీత,వేదాలు సబ్జెక్టు కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.