చెక్ ఇట్: ఏపీ ఎంసెట్-2019 ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 04:46 AM IST
చెక్ ఇట్: ఏపీ ఎంసెట్-2019 ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

Updated On : April 25, 2019 / 4:46 AM IST

వెబ్‌సైట్‌లో ఏపీ ఎంసెట్-2019 ప్రాథమిక ‘కీ’ని కాకినాడ JNTU విడుదల చేసింది. ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,95,908 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,85,711 మంది హాజరయ్యారు.

అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు నిర్వహించిన పరీక్షలకు 81,916 మంది హాజరయ్యారు. మొత్తం 115 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఏపీలో 109, హైదరాబాద్‌లో 6 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఏప్రిల్ 24తో పరీక్షలు ముగియగా.. అదేరోజు ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశారు.  

26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ: 
ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష పూర్తయిన నేపథ్యంలో సెషన్ల వారీగా ఇంజినీరింగ్ విభాగాలకు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలతోపాటు.. వాటికి సంబంధించిన కీని జేఎన్‌టీయూ విడుదల చేసింది. విద్యార్థి ప్రశ్నపత్రం, రాసిన జవాబు, సరైన సమాధానం తదితర వివరాలుంటాయని వివరించారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’పై ఎటువంటి అభ్యంతరాలున్నా 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు apeamcet2019objections@gmail.com మెయిల్‌కు నిర్దేశించిన ఫార్మాట్‌లో పూర్తిచేసి పంపించాలని పంపాల్సి ఉంటుంది.