Ap Inter results Date: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు? గత ట్రెండ్స్ బట్టి చూస్తే..
గతంలో ఎప్పుడు విడుదలయ్యాయి?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చి 19న ముగిశాయి. రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3న ప్రారంభమై మార్చి 20న ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫలితాల గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, ఈ పరీక్షల ఫలితాలు ఈ సారి ఏప్రిల్ 12-13న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బర్డ్‌ఫ్లూ భయం పోయింది.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. అయినప్పటికీ..
గతంలో ఎప్పుడు విడుదలయ్యాయి?
- 2024 ఏడాది ఏప్రిల్ 12న విడుదల
- 2023లో ఏప్రిల్ 26న విడుదల
- 2022లో జూన్ 22న విడుదల
- 2021లో జూలై 23న విడుదల
- 2020లో జూన్ 12న విడుదల
ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లు bieap.gov.in, resultsbie.ap.gov.in
ఇలా చెక్ చేసుకోవచ్చు
- అధికారిక వెబ్‌సైట్ bieap.gov.inని ఓపెన్ చేయండి
- హోమ్‌పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్ చేయండి
- మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సైన్ ఇన్ చేయండి
- మీ AP ఇంటర్మీడియట్ ఫలితం స్క్రీన్‌పై కనపడుతుంది
- మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి