చెక్ ఇట్ : ఏపీ 10వ తరగతి హాల్‌టిక్కెట్లు

ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్ ద్వారా పాఠశాల కోడ్, పాస్‌వర్డ్‌తో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు.
* హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2తో పరీక్షలు ముగియాలి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 22న జరగాల్సిన ఇంగ్లిష్ పేపర్-1 పరీక్ష ఏప్రిల్ 3న నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.