AP SSC Result 2025: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఇదే.. అధికారికంగా ఖరారు
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఓ ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఓ ప్రకటన చేశారు. అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మనమిత్ర), లీప్ యాప్ లలో పదో తరగతి పరీక్షల రిజల్ట్స్ చూసుకోవచ్చని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2025 మార్చిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు.
అభ్యర్థుల ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో చూసుకోవచ్చు.
వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, రోల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఫలితాలు PDF రూపంలో వస్తాయి.
అలాగే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్‌ల ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యాన్ని కల్పించారు.