Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. నెక్ట్స్ ఏం జరుగుతుంది? తనను అక్కడ ఖననం చేయొద్దని చెప్పిన ఫ్రాన్సిస్

వాటితో పాటు ఖననం చేసే తేదీని కార్డినల్స్ నిర్ణయిస్తారు.

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. నెక్ట్స్ ఏం జరుగుతుంది? తనను అక్కడ ఖననం చేయొద్దని చెప్పిన ఫ్రాన్సిస్

Pope Francis

Updated On : April 21, 2025 / 5:17 PM IST

అనారోగ్యంతో బాధపడుతూ కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) కన్నుమూశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం తరువాత రోమన్ కాథలిక్ చర్చిలో ఏమి జరుగుతుందన్న వివరాలపై వాటికన్ ఓ ప్రకటన చేసింది.

ప్రస్తుత పోప్ (పోప్ ఫ్రాన్సిస్) రోమన్ కాథలిక్ చర్చికి నాయకుడిగా ఉన్న సమయం అధికారికంగా ముగుస్తుంది. తదుపరి పాపసీ ప్రారంభమవుతుంది. అంటే, చర్చి తదుపరి ఆధ్యాత్మిక నాయకుడిగా కొత్త పోప్ ఎంపికకు ప్రక్రియ షురూ అవుతుంది.

పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని పోప్ కామెర్లెంగో (చాంబర్‌లైన్), కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారికంగా ధ్రువీకరిస్తారు. తరువాత పోప్ ప్రైవేట్ అపార్ట్మెంట్‌ను మూసివేసి అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తారు.

కామెర్లెంగో అంటే కాథలిక్ చర్చిలో ఓ వ్యక్తికి ఇచ్చే ప్రత్యేక టైటిల్. పోప్ చనిపోయినప్పుడు చర్చి వ్యవహారాలకు బాధ్యత వహించే వ్యక్తే కామెర్లెంగో. కొత్త పోప్‌ను ఎంచుకునే వరకు సంప్రదాయం ప్రకారం ప్రతిదీ పూర్తయిందని నిర్ధారించేది ఈయనే.

కామెర్లెంగోతో పాటు ఆయన ముగ్గురు సహాయకులు కలిసి.. పోప్ శవపేటికను సెయింట్ పీటర్స్ బాసిలికాలోకి ఎప్పుడు తీసుకెళ్లాలో నిర్ణయిస్తారు. అక్కడ పోప్‌ ఫ్రాన్సిస్ పార్థివ దేహాన్ని ప్రజలు చూడొచ్చు.

Also Read: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో కే13 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. ఎక్కడ కొనుక్కోవచ్చంటే..

తొమ్మిది రోజులపాటు సంతాప ఆచారాల ప్రకారం వాటికి సంబంధించిన కర్మలుజరుగుతాయి. వాటితో పాటు ఖననం చేసే తేదీని కార్డినల్స్ నిర్ణయిస్తారు. అంత్యక్రియలు సాధారణంగా మరణించిన తరువాత నాలుగు నుంచి ఆరు రోజులకు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరుగుతాయి.

అక్కడ ఖననం చేయొద్దని చెప్పిన ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్‌ కంటే ముందున్న చాలా మంది పోప్‌లను వారి మరణం తర్వాత వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలోని ప్రత్యేక స్థలం(క్రిప్ట్)లో ఖననం చేశారు. కానీ, తనను అక్కడ ఖననం చేయకూడదని ఫ్రాన్సిస్ ఇంతకు ముందే స్పష్టం చేశారు.

తనను రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా అనే మరో ప్రధాన చర్చిలో ఖననం చేయాలని చెప్పారు. ఇది ఆ నగరంలోని పురాతన చర్చిలలో ఒకటి.

అలాగే, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఖననం చేయాలని ఫ్రాన్సిస్ చెప్పారు. ఇతర పోప్‌లలా ఫాన్సీ శవపేటికలో కాకుండా సాదా చెక్కతో చేసిన శవపేటికలో ఉంచి తనను ఖననం చేయాలని అన్నారు.

ఈ ప్రక్రియ అంతా ముగిశాక “హబెమస్ పాపమ్” (మాకు కొత్త పోప్ ఉన్నారు) అని ప్రకటించడానికి సెయింట్ పీటర్స్ బాసిలికా సెంట్రల్ బాల్కనీలోకి కార్డినల్స్ కాలేజ్ డీన్ వస్తారు. అదే సమయంలో ప్రజలకు కొత్త పోప్ కనిపిస్తారు. ప్రజలకు ఆశీర్వాదం ఇస్తారు.