AP TET 2024 : ఏపీ టెట్ పరీక్ష 2024 రెస్పాన్స్ షీట్ విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి..!

AP TET 2024 : ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

AP TET 2024 : ఏపీ టెట్ పరీక్ష 2024 రెస్పాన్స్ షీట్ విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి..!

AP TET 2024 : Response Sheets Released For Andhra Pradesh Teacher Eligibility Test

AP TET Response Sheets Download : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024కు సంబంధించి రెస్పాన్స్ షీట్ విడుదల అయింది. గత ఫిబ్రవరి 27న ప్రారంభమైన టెట్ పరీక్షలు ఈ నెల (మార్చి) 9వ కొనసాగనున్నాయి. అయితే, ఇప్పటివరకూ టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సంబంధించి రెస్పాన్స్ షీట్లను ఏపీ విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ (aptet.apcfss.in)లో అందుబాటులో ఉంచింది. టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ఈ వెబ్‌సైట్ నుంచి తమ రెస్పాన్స్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. టెట్ అభ్యర్థులు యూజర్ ఐడీ, పుట్టిన తేదీలతో రెస్పాన్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : UPSC CSE 2024 : యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్ష దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎలా అప్లయ్ చేయాలంటే?

షెడ్యూల్ ప్రకారం.. పాఠశాల విద్యా శాఖ తాత్కాలిక ఆన్సర్ కీని మార్చి 10న రిలీజ్ చేయనుంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు మార్చి 11 వరకు గడువు ఉంటుంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో మార్చి 13న ఫైనల్ ఆన్సర్ కీ విడుదల కానుంది. ఒక్కో పేపర్‌కి సంబంధించిన సమాధానాల కీలను ఒక్కొక్కటిగా విడుదల చేయడం గమనార్హం. అంతేకాకుండా.. ఏపీ టెట్ 2024 ఫలితాలు మార్చి 14, 2024న ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీ టెట్ 2024 రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండిలా :
టెట్ అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్‌ను యాక్సెస్ చేయడానికి తమ యూజర్ ఐడీ, పుట్టిన తేదీని సమర్పించాలి. రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించండి.

  • టెట్ అభ్యర్థులు (aptet.apcfss.in) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో రెస్పాన్స్ షీట్ సెక్షన్ దగ్గర డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీరు క్లిక్ చేయగానే కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
  • ఆ పేజీలో, అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
  • మీ డివైజ్‌లో ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్‌ను చూడవచ్చు.
  • ఈ ఆన్సర్ షీట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ దగ్గర పెట్టుకోండి.

ముఖ్యమైన తేదీలివే :
షెడ్యూల్ ప్రకారం.. పాఠశాల విద్యా శాఖ తాత్కాలిక సమాధానాల కీని మార్చి 10న విడుదల చేస్తుంది. అభ్యర్థులు మార్చి 11 వరకు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చు. ఆ తర్వాత తుది సమాధాన కీ మార్చి 13న రిలీజ్ చేయనుంది. రెండు పేపర్‌లకు సమాధానాల కీలు విడిగా విడుదల కానున్నాయి. ఏపీ టెట్ 2024 ఫలితాలు మార్చి 14న ప్రకటించే అవకాశం ఉంది.

Read Also : JEE Main 2024 Paper 2 Result : అతి త్వరలో జేఈఈ మెయిన్ 2024 పేపర్ 2 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!