APEAPCET : ఏపీ ఈఏపీసెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

APEAPCET Exam Key : ఈ ప్రిలిమినరీ పరీక్షను రాసిన విద్యార్థులు ఈ నెల 25 ఉదయం నుంచి 10 గంటల్లోపు కీ సంబంధించిన అభ్యంతరాలను తెలపవచ్చునని అధికారులు తెలిపారు.

APEAPCET : ఏపీ ఈఏపీసెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

APEAPCET _ AP EAMCET 2024 ( Image Credit : Google )

APEAPCET : ఏపీలో ఈఏపీసెట్‌ (APEAPCET‌) పరీక్ష (పాత ఎంసెట్) ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లను కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రిలిమినరీ పరీక్షను రాసిన విద్యార్థులు ఈ నెల 25 ఉదయం నుంచి 10 గంటల్లోపు కీ సంబంధించిన అభ్యంతరాలను తెలపవచ్చునని అధికారులు తెలిపారు.

ఏపీ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్టీమ్, ఈ నెల 18 నుంచి ఈరోజు వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ మొత్తం దాదాపు 3.61 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు.

Read Also : Job Crisis At IITs : ఐఐటీల్లో ఉద్యోగ సంక్షోభం.. 38శాతం మందికి దక్కని ఉద్యోగాలు..!