Telangana Model Schools : తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు

రాష్ట్రంలో మత్తం 194 మోడల్ స్కూళ్లు ఉండగా 6వ తరగతిలో 19,400 సీట్లను భర్తీ చేయనున్నారు. మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించనున్నారు. మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మోడల్‌ స్కూల్‌ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్‌ 16న నిర్వహిస్తారు.

Telangana Model Schools : తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు

Telangana Model Schools

Updated On : January 10, 2023 / 5:57 PM IST

Telangana Model Schools : తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరో తరగతితోపాటు ఆయా మోడల్‌ స్కూళ్లలో 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో మత్తం 194 మోడల్ స్కూళ్లు ఉండగా 6వ తరగతిలో 19,400 సీట్లను భర్తీ చేయనున్నారు. మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించనున్నారు. మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మోడల్‌ స్కూల్‌ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్‌ 16న నిర్వహిస్తారు.

ఆసక్త కలిగిన విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష అనంతరం ఫలితాలను మే 15న వెల్లడిస్తారు. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలు మోడల్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ ; https://www.telanganams.cgg.gov.in/ పరిశీలించగలరు.