FSSAI లో 275 పోస్టులు : మార్చి 26 నుంచి దరఖాస్తు

  • Published By: veegamteam ,Published On : March 25, 2019 / 09:53 AM IST
FSSAI లో 275 పోస్టులు : మార్చి 26 నుంచి దరఖాస్తు

Updated On : March 25, 2019 / 9:53 AM IST

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 275 ఖాళీలున్నాయి. మార్చి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. FSSAI అధికారిక fssai.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అసలైతే మార్చి 15నుంచి దరఖాస్తు ప్రక్రియ  మొదలుకావాల్సి ఉంది. కానీ… కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ ఆలస్యంగా రిలీజైంది.  

* ముఖ్యమైన తేదిలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2019 మార్చి 26
దరఖాస్తుకు చివరి తేదీ      : 2019 ఏప్రిల్ 14

* పోస్టుల వివరాలు:

               పోస్టులు   పోస్టుల సంఖ్య
అసిస్టెంట్ డైరెక్టర్         05
అసిస్టెంట్ డైరెక్టర్-టెక్నికల్         15
టెక్నికల్ ఆఫీసర్        130
సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్         37
అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్         02
అసిస్టెంట్         34
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1         07
హిందీ ట్రాన్స్‌లేటర్         02
పర్సనల్ అసిస్టెంట్         25
అసిస్టెంట్ మేనేజర్(IT)         05
IT అసిస్టెంట్         03
డిప్యూటీ మేనేజర్         06
అసిస్టెంట్ మేనేజర్         04
మొత్తం పోస్టులు        275