కొత్త టీచర్లు వస్తున్నారు

తెలంగాణలో ఇన్నాళ్లకు కొత్త టీచర్లు బడుల్లోకి రాబోతున్నారు. 2017లో జరిగిన టీఆర్‌టీ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో 2వేల 788మంది ఎస్జీటీలు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఏజెన్సీలో మొత్తం 3వేల 127 పోస్టులను విద్యాశాఖ గుర్తించగా అందులో 2వేల 822మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. కౌన్సెలింగ్‌కు 2వేల 788 మంది హాజరుకాగా… 34మంది గౌర్హాజరయ్యారు. దీంతో వీరికి వచ్చేనెల 4న రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక పత్రాలను అందజేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.