BESCOM Recruitment : ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ

పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఉంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 యేళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

BESCOM Recruitment : ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ

BESCOM

Updated On : October 18, 2022 / 4:32 PM IST

BESCOM Recruitment : బెంగుళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ ఖాళీల వివరాలు పరిశీలిస్తే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఖాళీలు143, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఖాళీలు 116, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఖాళీలు 36, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఖాళీలు 20, సివిల్ ఇంజనీరింగ్ ఖాళీలు 5, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఖాళీలు 5 ఉన్నాయి.

డిప్లొమా అప్రెంటీస్‌ ఖాళీలకు సంబంధిచి టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటీస్‌ పోస్టులు ఖాళీలు 75, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఖాళీలు 55, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఖాళీలు 10, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఖాళీలు 10

పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఉంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 యేళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.8000ల నుంచి రూ.9000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bescom.co.in/ పరిశీలించగలరు.