Jobs In Telangana Universities: తెలంగాణ యూనివర్శిటీల్లో ఉద్యోగాలు.. త్వరలోనే ప్రకటన.. మరిన్ని వివరాలు మీకోసం

Jobs In Telangana Universities: తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకంపై కీలక అప్‌డేట్ వచ్చింది.

Jobs In Telangana Universities: తెలంగాణ యూనివర్శిటీల్లో ఉద్యోగాలు.. త్వరలోనే ప్రకటన.. మరిన్ని వివరాలు మీకోసం

Assistant proffecer Jobs In Telangana Universities

Updated On : June 28, 2025 / 1:05 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకంపై కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు యూనివర్సిటీల్లోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వాటిలో ఉస్మానియా యూనివర్శిటీ (OU), కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీ, శాతవాహన యూనివర్శిటీ ఉన్నాయి. అదేవిదంగా మిగతా 8 యూనివర్శిటీల్లో కూడా నియామకాల ప్రక్రియను కొనసాగించే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఐతే.. ఇందులో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు సిబ్బందిని మినహాయించి మిగిలిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నారు.

నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 4న విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. కానీ, 2 నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 74 శాతం టీచింగ్ సిబ్బంది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఉద్యోగాల నియామకం కోసం పాలకమండళ్ల ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల సెక్రటేరియట్‌లో కాకతీయ, శాతవాహన, ఓయూ, పాలమూరు యూనివర్శిటీల పాలకమండళ్ల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొనహాయించి మిగతా ఖాళీల భర్తీకి ఆమోదం లభించింది. ఈ పోస్టులపై రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను రూపొందించి, నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మరో 3 నెలల సమయం పెట్టె ఎవకాశం ఉంది.