Group 1 Mains Result: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పటి నుంచి అంటే..

ఏపీలో గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు.

Group 1 Mains Result: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పటి నుంచి అంటే..

APPSC Group 1 Notification (Photo : Google)

Updated On : June 10, 2025 / 10:56 PM IST

Group 1 Mains Result: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మూల్యాంకనం పూర్తి చేసింది. మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన నెల రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు ఎంపిక చేసింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

ఏపీలో గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్‌కు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అందులో 91,463 (72.55 శాతం) మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇక వీరిలో మెయిన్స్ పరీక్షకు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 182 మంది ఇంటర్వ్యూకు చేరుకున్నారు.

Also Read: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. రూ.56 వేల జీతం.. ఇవాళే చివరి తేదీ.. ఇలా అప్లై చేసుకోండి..

మే లో పరీక్షలు నిర్వహించారు. వాల్యుయేషన్ అనంతరం ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. మొత్తం 81 గ్రూప్ -1 పోస్టులను భర్తీ చేయనున్నారు.

APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
* APPSC అధికారిక వెబ్ సైట్ (psc.ap.gov.in.) కి వెళ్లాలి.
* APPSC సెక్షన్ వెబ్ సైట్ కి వెళ్లాక (https://portal-psc.ap.gov.in/Default), అనౌన్స్ మెంట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
* Result Notification పై క్లిక్ చేయాలి
* మెయిన్స్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్లతో కూడిన పీడీఎఫ్ ని చూడొచ్చు.

 

గ్రూప్ 1 సెలక్షన్ ప్రాసెస్..
* ప్రిలిమ్స్
* మెయిన్స్
* ఇంటర్వ్యూ
* డీవీ