ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 07:33 AM IST
ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు

Updated On : February 7, 2019 / 7:33 AM IST

ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి జనవరిలో APPSC నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 405 పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 95 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, 310 కొత్త పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

అర్హులు:
– సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉండి.. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
– ఫీజు చెల్లించడానికి చివరితేది ఫిబ్రవరి 26
– దరఖాస్తు చేసుకోయడానికి చివరితేది ఫిబ్రవరి 27
– ద‌ర‌ఖాస్తు ఫీజుగా రూ.250/- 
– పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.
– మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్ష, రెండో దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
– ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. ప్రిలిమ్స్ పరీక్షను మాత్రం అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే ఆఫ్‌లైన్ ద్వారా, దాటకపోతే ఆన్‌లైన్ ద్వారానే పరీక్ష నిర్వహించనున్నారు.