APPSC Job Notification: త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు
APPSC Job Notification: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు వచ్చినందున ఈ నోటిఫికేషన్ ఇవ్వనుంది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు వచ్చినందున ఈ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. అంతేకాకుండా.. అటవీ శాఖలోనే 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఇతర శాఖలకు చెందిన మరో 75 పోస్టులకు మొత్తం 175 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం మరో వారం రోజుల్లో విడుదల కానుంది.
శాఖల వారీగా పోస్టుల వివరాలు:
- వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు 10, దేవాదాయ శాఖలో కార్యనిర్వహణ అధికారి పోస్టులు 7, జిల్లా సైనిక అధికారి పోస్టులు 7, ఇంటర్ విద్య గ్రంథ పాలకులు పోస్టులు 2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు 1, జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు పోస్టులు (ప్రిజన్స్)1, (క్యారీ ఫార్వర్డ్) 1, మరికొన్ని శాఖల్లో కూడా పోస్టులు ఉన్నాయి.
- మున్సిపల్ శాఖలో సీనియర్ ఎకౌంటెంట్, జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఎకౌంటెంట్ మూడు కలిపి మొత్తం పోస్టులు 11, భూగర్భ నీటిపారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 04, మత్స్యశాఖ శాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు 03, ఉద్యానవన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి.
ఇక పైన తెలిపిన పోస్టులకు గాను ఆయా విభాగాల సిలబస్ ప్రకారంగా ఉమ్మడి పరీక్షను నిర్వహించనున్నారు. అయితే, కొంతమంది అభ్యర్తలు వేరు శాఖల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలంటి పరిస్థితిలో అన్నిటికీ కలిపి ఉమ్మడి పరీక్షా నిర్వహించడం సాధ్యం కాదు. ప్రస్తుతం దీనిపైనే చర్చలు కొనసాగుతున్నయి. త్వరలోనే తుది ప్రకటన వెలువడుతుంది.