BLW Recruitment 2025: రైల్వే BLW అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్.. 374 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు, పూర్తి వివరాలు
BLW Recruitment 2025: బనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్‌డబ్ల్యూ) అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

BLW Recruitment 2025 Notification Released
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ అవకాశం మీకోసమే. బనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్‌డబ్ల్యూ) అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 374 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో నాన్-ఐటీఐ 300 పోస్టులు, ఐటీఐ 74 పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 05 వరకు అధికారిక వెబ్‌సైట్ apprenticeblw.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
విద్యార్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ కూడా ఉండాలి.
వయోపరిమితి:
నాన్-ఐటీఐ వారికి గరిష్ట వయస్సు 22 సంవత్సరాలు ఉండాలి. ఐటీఐకి గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళల అభ్యర్థులలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
10వ తరగతి, ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ apprenticeblw.in లోకి వెళ్ళాలి.
- హోమ్ పేజీలో అప్రెంటిస్‌షిప్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి
- దరఖాస్తు ఫారంలో అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి
- తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాలి.
- తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- చివరకు దాని ప్రింటవుట్ తీసుకోవాలి.