భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 08:59 AM IST
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు

Updated On : March 7, 2020 / 8:59 AM IST

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.(తూర్పు రైల్వేలో 2వేలకు పైగా అప్రెంటిస్ ఉద్యోగాలు)

విభాగాల వారీగా ఖాళీలు : 
ఫిట్టర్ – 16
టర్నర్ – 4
ఎలక్ట్రీషియన్ – 14
ఎలక్ట్రానిక్ మెకానిక్ – 19
మెషినిస్ట్ – 5
డ్రాప్ట్స్ మెన్(సివిల్) – 4
డ్రాప్ట్స్ మెన్(మెకానికల్) – 9
రిఫిజిరేటర్ & ఎయిర్ కండిషనర్ మెకానిక్ – 4
ఎలక్ట్రోప్లేటర్ – 4
వెల్డర్ – 2
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 69

విద్యార్హత : అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు 21 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 28, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 16, 2020.  

See Also | ఇషా ఇంట హోళీ వేడుకల్లో బాలీవుడ్ తారలు