చెక్ ఇట్ : BPNL లో 3వేలకు పైగా సేల్స్ ఉద్యోగాలు

  • Published By: Chandu 10tv ,Published On : August 20, 2020 / 04:18 PM IST
చెక్ ఇట్ : BPNL లో 3వేలకు పైగా సేల్స్ ఉద్యోగాలు

Updated On : August 20, 2020 / 4:47 PM IST

భారత పశుపాలన్ నిగమ్‌ లిమిటెడ్ (BPNL)లల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 3348 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవటానికి ఆగస్టు 31, 2020 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.



విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ అసిస్టెంట్- 2700
సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్- 540
సేల్స్ మేనేజర్- 108



విద్యార్హత: సేల్స్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతి, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్, సేల్స్ మేనేజర్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లు, సేల్స్ మేనేజర్ పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి.



వేతనం: సేల్స్ అసిస్టెంట్‌కు రూ.15 వేలు, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు రూ.18 వేలు, సేల్స్ మేనేజర్‌కు రూ. 21 వేలు ప్రారంభ వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్దులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.