సీబీఎస్‌ఈ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయ్.. 93.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణత
మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ IDని టైప్ చేయండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదో తరగతి రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు కూడా విడుదలైన విషయం తెలిసిందే. పదో తరగతి ఫలితాల్లో 93.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. cbse.gov.in లేదా cbseresults.nic.inలో విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. డిజీ లాకర్, ఉమాంగ్ యాప్‌లలోనూ చెక్ చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా 7,842 సెంటర్లతో పాటు మరో 26 దేశాల్లో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలను మొత్తం 42 లక్షల మంది విద్యార్థులు రాశారు. వారిలో పదో తరగతి విద్యార్థులు 24.12 లక్షల మంది ఉన్నారు.
Also Read: సీబీఎస్‌ఈ 12వ తరగతి రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
విద్యార్థులు తమ CBSE 10వ తరగతి ఫలితాలను ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు
cbseresults.nic.in
cbse.gov.in
results.cbse.nic.in
results.digilocker.gov.in
UMANG యాప్
CBSE క్లాస్ 12 రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోవచ్చు
అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in, cbse.gov.inలో ఏదైనా ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
CBSE క్లాస్ 10 రిజల్ట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి
మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ IDని నమోదు చేయండి
మీ ఫలితాన్ని చూసుకోవచ్చు