CBHFL Recruitment 2023 :సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్(CBHFL)లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరాఖాస్తులు కోరుతున్నారు.

CBHFL Recruitment 2023

CBHFL Recruitment 2023 : సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్(CBHFL)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరాఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Gas Cylinder Leak : విశాఖ జిల్లాలో గ్యాస్ సిలిండర్ లీక్.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

వివరాలు..

పోస్టుల సంఖ్య: 60. వీటిలో ఎస్సీ-12, ఎస్టీ్-12, ఓబీసీ-15, ఈడబ్ల్యూఎస్-03, యూర్(జనరల్)-18 కేటాయించారు.

ఆఫీసర్‌: 31 పోస్టులు

అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

READ ALSO :  Drone Spraying : పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి

సీనియర్‌ ఆఫీసర్‌: 27 పోస్టులు

అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌): 01 పోస్టు

అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ(హెచ్‌ఆర్‌) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

READ ALSO : Foot Pain Home Remedies : పాదాల నొప్పితో బాధపడుతున్నారా ! నొప్పిని తగ్గించే ఇంటి నివారణ చిట్కాలు ఇవే !

సీనియర్‌ ఆఫీసర్‌ (కంప్లైన్స్‌): 01 పోస్టు

అర్హత విషయానికి వస్తే కంపెనీ సెక్రటరీ(ఎగ్జిక్యూటివ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Snake In Helmet : హెల్మెట్‌లో దూరిన నాగుపాము .. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

దరఖాస్తు ఫీజు:

రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

READ ALSO : Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. బరిలో 2,290 మంది అభ్యర్ధులు

పరీక్ష విధానం:

మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

జీతం:

ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.3.60 లక్షలు, సీనియర్ ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.4 లక్షలు చెల్లిస్తారు.

READ ALSO : Indian Students : భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు…యూఎస్ ఎన్ని వీసాలు జారీ చేసిందంటే…

పరీక్ష కేంద్రాలు:

బెంగళూరు, భోపాల్, ఢిల్లీ/ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబయి/నేవీ ముంబయి/థానే/ఎంఎంఆర్ రీజియన్, చెన్నై.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 11.12.2023.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.12.2023.

READ ALSO : Police Raides : భైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో ఎఫ్ ఎస్టీ టీమ్ తో పోలీసుల సోదాలు

ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి, 2024లో.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.cbhfl.com/ పరిశీలించగలరు.