Snake In Helmet : హెల్మెట్‌లో దూరిన నాగుపాము .. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఓ వ్యక్తి హెల్మెట్ లో దూరిన నాగుపామును గుర్తించటం చాలా కష్టంగా మారింది. అది అచ్చంగా ఆ హెల్మెట్ డిజైన్ లోనే ఉంది. హెల్మెట్ లో దూరి చక్కగా పడగవిప్పి బయటకు చూస్తోంది.

Snake In Helmet : హెల్మెట్‌లో దూరిన నాగుపాము .. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Snake Hiding In Bike Helmet

Snake Hiding In Bike Helmet :  కారులో దూరిన కొండచిలువ. బైక్ లో దూరిన నాగుపాము,షూలో దాక్కున్న పాము అనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వింటున్నాం. చూస్తున్నాం. తాజాగా ఓ నాగుపాము ఓ వ్యక్తి హెల్మెట్ లో దూరింది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఓ వ్యక్తికి సంబంధించిన హెల్మెట్ లో దూరిన నాగుపామును గుర్తించటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే అది అచ్చంగా ఆ హెల్మెట్ డిజైన్ లోనే ఉంది. తకు డిజైన్ కరెక్ట్ గా సరిపోతుంది అనుకుందో ఏమోగానీ హెల్మెట్ లో దూరి చక్కగా పడగవిప్పి మరీ బయటకు చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ బుసలు కొడుతోంది. అదేనండీ వైరల్ అవుతోంది.

హెల్మెట్ డిజైన్ లో కలిసిపోయిన ఈ నాగుపామును గుర్తించకుండా ఏమాత్రం ఏమరుపాటుగా హెల్మెట్ ను పట్టుకుంటే.. ఇంకేముంది అది కాటు వేయటం ఖాయం. హెల్మెట్ లో దూరిన ఆ నాగుపాము చక్కగా పడగవిప్పి మరీ ఫోజులిచ్చింది. దాడి చేయటానికి సిద్ధంగా ఉంది.

కేరళలోని త్రిసూర్ కు చెందిన ఓ వ్యక్తి తన టూవీలర్ ను పార్క్ చేశాడు. ఆఫీసుకు టూవీలర్ పై వెళ్లి పార్క్ చేశాడు. హెల్మెట్ ఆ పక్కనే ఉన్న ప్లాట్ ఫారమ్ పై పెట్టి ఆఫీసుకు వెళ్లిపోయాడు. తిరిగి సాయంత్రం వచ్చాడు. అక్కడే ఉన్న హెల్మెట్ తీసుకోబోతుండగా ఏదో అనుమానం వచ్చింది.హెల్మెట్ ను పరిశీలించి చూశాడు. అంతే గుండెఒక్కసారిగా కొట్టుకోవటం స్పీడ్ అందుకుంది.

హెల్మెట్ లో ఓ నాగుపాము పడగవిప్పి కనిపించింది. హెల్మెట్ డిజైన్ , పాము శరీరం రంగు అంతా కలిసిపోయి ఉండటంతో దాన్ని గుర్తించటం చాలా కష్టమైంది. కానీ అతను ఏమాత్రం ఏమరుపాటుగా ఉండి హెల్మెట్ తీసుకోవటానికి యత్నించినా ప్రమాదం జరిగి ఉండేది. కానీ అతని టైమ్ బాగున్నట్లుంది, హెల్మెట్ ను పరిశీలించటంతో పాముకాటునుంచి తప్పించుకున్నాడు. విషపూరిత పాము కాటు నుండి తృటిలో తప్పించుకున్నాడు. హెల్మెట్ లో దూరి చక్కగా పడుకున్న నాగుపాము వీడియోను దేవ్ శ్రేష్ట తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

కాగా..వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయి. చెప్పులు, షూస్ వంటివాటిలో పాములు చేరే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా మరీ ముఖ్యంగా షూష్ వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.గతంలో చిన్నారులు ధరించే షూస్ లో పాము ఉన్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద ట్విట్టర్ లో ఇటువంటి వీడియోను పోస్ట్ చేశారు. వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

 

View this post on Instagram

 

A post shared by Dev Shrestha (@d_shrestha10)