C-DAC : సీ-డాక్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, మేనేజర్‌ పోస్టులు భర్తీ

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ డెలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

C-DAC : సీ-డాక్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, మేనేజర్‌ పోస్టులు భర్తీ

C-DAC

Updated On : October 12, 2022 / 3:10 PM IST

C-DAC : కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ డెలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 530 పోస్టులను భర్తీ చేస్తోంది.

ఇందులో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌, ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌, నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, మాడ్యూల్‌ లీడ్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.

Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ

మొత్తం 530 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రాజెక్ట్‌ అసోసియేట్ 30‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్ 250‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌, ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌, నాలెడ్జ్‌ పార్ట్‌నర్ 50‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, మాడ్యూల్‌ లీడ్‌ అండ్‌ ప్రాజెక్ట్‌, ప్రాజెక్ట్‌ లీడ్‌ 200 చొప్పున ఉన్నాయి.

అభ్యర్థులు బీఈ లేదా బీటెక్‌, సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 20. వెబ్‌సైట్‌: https://www.cdac.in/.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.