APPSC పరీక్ష తేదీల్లో మార్పులు
ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్‌లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు.

ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్‌లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు.
గుంటూరు : ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్‌లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు. పలు పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వాయిదా వేసింది. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పరీక్షను ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేశారు. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్ పరీక్షను ఏప్రిల్ 25 వ తేదీన కాకుండా ఏప్రిల్ 29, 30వ తేదీల్లో జరుగనుంది. రీసెర్చి ఆఫీసర్ పరీక్షను ఏప్రిల్ 25న కాకుండా ఏప్రిల్ 28, 29 వ తేదీల్లో, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పరీక్షను ఏప్రిల్ 17న కాకుండా ఏప్రిల్ 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు ఏపీపీఎస్సీ మార్చి 18 సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఏఈఈ పరీక్షను ఏప్రిల్ 29, 30వ తేదీల్లో కాకుండా మే 14, 15 వ తేదీల్లో జరుపనున్నారు. ఏప్రిల్ 3, 4వ తేదీల్లో జరుగాల్సిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పరీక్షను మే 14, 15వ తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్ 2 నుంచి జరుగాల్సిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షను జూన్ 9వ తేదీన జరుగనుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షను మే 26 నుంచి జూన్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.