DCCB Chittoor Recruitment : చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా కామర్స్ గ్రాడ్యుయేషన్ లేదా ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్‌లో 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

DCCB Chittoor Recruitment :
DCCB Chittoor Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా కామర్స్ గ్రాడ్యుయేషన్ లేదా ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్‌లో 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పరిజ్ఞానంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం. అభ్యర్ధుల వయసు వయసు18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.26,080ల నుంచి రూ.57,860 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://apcob.org/careers/ పరిశీలించగలరు.