Coal India Jobs : కోల్ ఇండియాలో ఉద్యోగ దరఖాస్తుకు సమీపిస్తున్న తుదిగడువు
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మైనింగి విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ,బీటెక్,బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. సివిల్ కు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

Jobs
Coal India Jobs : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1050 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనన్నారు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ ఈడీపీ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మైనింగి విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ,బీటెక్,బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. సివిల్ కు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సిస్టం అండ్ ఈడీపీ కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 30ఏళ్లలోపు ఉండాలి. సంబంధిత విభాగాల్లో గేట్ 2022 స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సాధించిన గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.coalindia.in/ పరిశీలించగలరు.