ఈఎస్ఐసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్..

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 04:17 AM IST
ఈఎస్ఐసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్..

ఢిల్లీ  : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లో దేశ వ్యాప్తంగా వివిధ ఈఎస్ఐసీ హాస్పిటల్స్ లో 329 స్పెషలిస్ట్ గ్రేడ్ -2 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ అయ్యింది.
గ్రేడ్స్ అండ్ యూజింగ్ పోస్ట్ లు :  స్కేల్-72, జూనియర్ స్కేల్ 257గా వున్నాయి.
డిపార్ట్ మెంట్ : అనస్థీషియా, కార్డియాలజీ, హెమటాలజీ, న్యూరాలజీ వంటి పలు సెక్షన్స్ లకు సంబంధించిన డాక్టర్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది.
క్వాలిఫికేషన్ : ఎంబీబీఎస్ తో పాటు రిలేటెడ్ స్పెషాలిటీలో పీజీ ఎక్స్ పీరియన్స్ వుండాలి.
ఏజ్ లిమిట్ : 2019 జనవరి 24వ తేదీకి 45ఏళ్లు మించకుండా వుండాలి..రిజర్వేషన్ అర్హత వున్న వారికి మాత్రం ఏజ్ విషయంలో సడలింపు వుంటుంది..సెలక్షన్ ప్రాసెస్ అంతా ఇంటర్వ్యూ ద్వారానే జరుగుతుంది.
అప్లికేషన్స్ : ఆఫ్ లైన్ లోనే వుంటుంది.
అప్లికేషన్ ఫీజ్ : రూ.500 వుండగా..ఎస్సీ, ఎస్టీ,పీడబ్ల్యూడీ, మహిళలకు మాత్రం అప్లికేషన్ ఉచితం.
అప్లికేషన్ లాస్ట్ డేట్ : 2019 జనవరి 24
ఫుల్ డిటైల్స్  : www.esic.nic.in లో