యూపీఎస్సీ-2019 పరీక్షా షెడ్యూల్ విడుదల

యూపీఎస్సీ 2019 పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాదికి సంబంధించి పరీక్షా షెడ్యూల్‌ను పీఎస్‌యూ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 09:50 AM IST
యూపీఎస్సీ-2019 పరీక్షా షెడ్యూల్ విడుదల

యూపీఎస్సీ 2019 పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాదికి సంబంధించి పరీక్షా షెడ్యూల్‌ను పీఎస్‌యూ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది.

న్యూఢిల్లీ: యూపీఎస్సీ 2019 పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాదికి సంబంధించి పరీక్షా షెడ్యూల్‌ను పీఎస్‌యూ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లో అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది యూపీఎసీ ఎగ్జామ్ క్యాలెండర్‌లో నోటిఫికేషన్లు, పరీక్షా తేదీలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది. ఈ ఏడాది పరీక్షా షెడ్యూల్‌ను విడుదల చేసిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను కూడా వెల్లడించింది. జూన్ 2న ప్రిలీమ్స్ పరీక్షను నిర్వహించింది. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేయనుంది.

మార్చి 18 వరకు దరఖాస్తు.. 
ప్రిలీమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 18 వరకు గడువు విధించింది. సివిల్ సర్వీసు మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 20న నిర్వహించనుంది. ఈ ఏడాది యూపీఎస్సీ, ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షల నోటిఫికేషన్లు కూడా వచ్చే జనవరి 9న విడుదల చేయనుండగా.. ఏప్రిల్ 21న పరీక్షలను నిర్వహించనున్నారు. యూపీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులందరూ పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ వెబ్‌సైట్‌‌ను విజిట్ చేసి 2019 ఎగ్జామ్ క్యాలెండర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

UPSC, UPSC releases exam calendar, UPSC exam schedule calender, UPSC official website