Job Mela: బంపర్ ఆఫర్.. రేపే విశాఖలో భారీ జాబ్ మేళా.. టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ లో జాబ్స్, పూర్తి వివరాలు
Job Mela: డాటాప్రో, ద్వారకానగర్ క్యాంపస్‌లో జులై 19న మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. దీనికి సంబంధించి సంస్థ డైరెక్టర్లు రంగినేని సాయిప్రసాద్, సిద్ధవరపు ప్రసాద్ ఒక ప్రకటన చేశారు.

Datapro, Dwarkanagar Campus to organize mega job fair in Vishakhapatnam
ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. డాటాప్రో, ద్వారకానగర్ క్యాంపస్‌లో జులై 19న మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. దీనికి సంబంధించి సంస్థ డైరెక్టర్లు రంగినేని సాయిప్రసాద్, సిద్ధవరపు ప్రసాద్ ఒక ప్రకటన చేశారు. ప్రతీ నెల మూడవ శనివారం డాటాప్రో జాబ్ మేళాలను నిర్వహిస్తుందని, కానీ, ఈసారి సంస్థ 35వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, నాన్-ఐటీ కంపెనీలు పాల్గొనబోతున్నాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జాబ్ మేళాలో పాల్గొనబోయే సంస్థలు:
టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, కాన్సెంట్రిక్స్, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, స్టడీ కనెక్ట్, ఫ్ర్యూజెస్, క్వెస్, డిక్సన్, వరుణ్ మోటార్స్, కియా మోటార్స్, హ్యుండాయ్ మొబిస్, విజన్ ఇండియా, అపోలో ఫార్మసీ, డెక్కన్, డైకిన్, జోస్ట్ వంటి చాలా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.
విద్యార్హతలు:
పదవతరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బి.టెక్, డిప్లొమా, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
ఈ జాబ్ మేళాలో ఎంపిక అయిన అభ్యర్థులు విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగ మేళాకి సంబంధించి అభ్యర్థులకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండ ఈ అవకాశాని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.