10వ తరగతి ఉంటే చాలు : ఏపీ అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు

విజయవాడ : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా ? మీరు డ్రైవర్లా ? అయితే ఈ న్యూస్ మీకోసమే…ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రైవర్ల పోస్టులు పడ్డాయ్… మొత్తం ఖాళీలు 85 ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖలో పోస్టుల భర్తీకి రాష్టస్థాయి పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు దరఖాస్తులను కోరుతోంది. డ్రైవర్ ఆపరేటర్ పోస్టు..ఖాళీలు 85. అర్హత : 10వ తరగతి పాస్ అయి ఉండాలి. హెవీ మోటార్ వాహన లైసెన్స్, నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలుండాలి. ఇక వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక : ఫిజికల్ మెజర్ మెంట్స్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు : ఆఫ్ లైన్, దరఖాస్తులను సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయాల నుంచి పొందవచ్చు. దరఖాస్తుల విక్రయం : 2019 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు విక్రయిస్తారు. దరఖాస్తుల స్వీకరణ : జనవరి 29 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఫారాలు తీసుకుంటారు.
మరింత సమాచారం కోసం http:/slprb.ap.gov.in/ http://slprb.ap.gov.in/job-list