AP Eapcet 2025 Counselling: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. EAPCET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

AP Eapcet 2025 Counselling: ఏపీ ఈఏపీసెట్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల అయ్యింది. జూలై 7 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభంకానుందని అధికారులు ప్రకటన చేశారు.

AP Eapcet 2025 Counselling: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. EAPCET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

Ap Eapcet 2025 counselling schedule released

Updated On : July 4, 2025 / 11:26 AM IST

ఏపీ ఈఏపీసెట్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల అయ్యింది. జూలై 7 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభంకానుందని అధికారులు ప్రకటన చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు జూలై 16వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు సాధించిన ర్యాంక్ ల ఆధారంగా జూలై 22న సీట్లను కేటాయించనున్నారు అధికారులు.

ఏపీ EAPCET-2025 కౌన్సిలింగ్ ముఖ్య తేదీలు:

  • 04 జులై 2025న నోటిఫికేషన్ విడుదల
  • 07జులై 2025 నుంచి 16 జులై 2025 వరకు రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు
  • 07 జులై 2025 నుంచి 17 జులై 2025 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • 10 జులై 2025 నుంచి 18 జులై 2025 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
  • 19 జులై 2025 న వెబ్ ఆప్షన్ల మార్పు
  • 22 జులై 2025 న సీట్ల కేటాయింపు
  • 23 జులై 2025 నుంచి 26 జులై 2025 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. లేదా సీట్ క్యాన్సల్ అవుతుంది.
  • 04 ఆగస్టు 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి

మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు: 9177927677, 7995681678, 7995865456 సంప్రదించవచ్చు.

అవసరమైన ధ్రువపత్రాలు: ఏపీ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డు, ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్, టెన్త్ మెమో, ఇంటర్ మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ ధ్రువీకరణపత్రం, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు సంబంధిత సర్టిఫికెట్ ఉండాలి, లోకల్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్.

మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వె సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ఏపీ ఈఏపీసెట్ – 2025 ఫలితాలు అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • మీ ర్యాంక్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
  • దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.