అప్లై చేసుకోండి : ECIL లో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 64 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులకు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు గేట్ లో పాసై ఉండాలి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
CSE – 10
మెకానిక్ – 24
ECE – 30
విద్యార్హత :
అభ్యర్ధులు 65 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణలై ఉండాలి. అంతేకాదు గేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్ధులను ఇంటర్వూ , గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ సమయంలో నెలకు రూ.48 వేలకు పైగా స్టైపెండ్ వస్తుంది. పీఎఫ్, సెలవులు కూడా వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు :
జనరల్, OBC,EWS అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 06, 2019.
దరఖాస్తు చివరి తేది : జనవరి 01, 2020.
Read Also.. అప్లై చేసుకోండి: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 249 ఉద్యోగాలు