Get Ready : FCIలో 4వేల 103 ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 06:11 AM IST
Get Ready : FCIలో 4వేల 103 ఉద్యోగాలు

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. 4వేల 103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  FCI పరిధిలోని నార్త్‌జోన్, సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, నార్త్-ఈస్ట్ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ), స్టెనో గ్రేడ్-II, టైపిస్ట్ (హిందీ), అసిస్టెంట్ గ్రేడ్-III (ఏజీ III) (జనరల్/అకౌంట్స్/టెక్నికల్/డిపో) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫీజు రూ.500 చెల్లించి మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, దివ్యాంగులు, రక్షణ దళాలకు చెందినవారు, ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. అభ్యర్థులు ఏదైనా ఒక్క జోన్ పరిధిలో పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

* జోన్ల వారీగా ఖాళీలు:

   జోన్  పోస్టల సంఖ్య
నార్త్ జోన్  1,999
సౌత్ జోన్  540
ఈస్ట్ జోన్  538
వెస్ట్ జోన్  735
నార్త్ ఈస్ట్  291
మొత్తం ఖాళీలు  4,103

 

* పోస్టుల వివరాలు:

                   పోస్టులు                          ఖాళీలు
జూనియర్ ఇంజినీర్ (సివిల్)   114
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్)  72
స్టెనో గ్రేడ్-II   76
అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ)  44
టైపిస్ట్ (హిందీ)  38
అసిస్టెంట్ గ్రేడ్-II (జనరల్)  757
అసిస్టెంట్ గ్రేడ్-II (అకౌంట్స్)   509
అసిస్టెంట్ గ్రేడ్-II (టెక్నికల్)   720
అసిస్టెంట్ గ్రేడ్-II (డిపో)  1,773
 మొత్తం పోస్టులు    4,103

* వయస్సు పరిమితి :

       పోస్టులు  వయస్సు
జూనియర్ ఇంజినీర్  28 సం 
స్టెనో  25 సం 
అసిస్టెంట్ గ్రేడ్-III  27 సం
అసిస్టెంట్ గ్రేడ్-II   28 సం
టైపిస్ట్  25 సం

 
దరఖాస్తు విధానం:
 ‌ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: 
ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా. 

పరీక్ష విధానం:
 రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. 

– విద్యార్హతలు:

జూనియర్ ఇంజనీర్ (సివిల్): డిగ్రీ/డిప్లొమా (సివిల్/ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్). డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్): డిగ్రీ/ డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. 

స్టెనో గ్రేడ్-II: డిగ్రీతో పాటు DOEACC (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అక్రిడియేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సుల్లో ‘O’ లెవెల్ అర్హత ఉండాలి. నిమిషానికి 40 పదాలు, షార్ట్ హ్యాండ్‌లో 80 పదాలు టైప్ చేయగలగాలి. 

అసిస్టెంట్ గ్రేడ్ -II (హిందీ): ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

టైపిస్ట్ (హిందీ): డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నిమిషానికి 30 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. 

అసిస్టెంట్ గ్రేడ్-III (జనరల్) : ఏదైనా డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. 

అసిస్టెంట్ గ్రేడ్-III (అకౌంట్స్) : కామర్స్ డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. 

అసిస్టెంట్ గ్రేడ్-III (అకౌంట్స్): బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (బోటనీ/జువాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/ఫుడ్ సైన్స్) లేదా బీఈ/బీటెక్ (ఫు్ సైన్స్/ఫుడ్ సైన్స్/ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ బయోటెక్నాలజీ).

ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.03.2019