Eil Jobs : న్యూదిల్లీ ఈఐఎల్ లో 60 ఖాళీల భర్తీ

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 01,2022 నుండి ప్రారంభమౌతుంది.

Eil Jobs : న్యూదిల్లీ ఈఐఎల్ లో 60 ఖాళీల భర్తీ

Eil Delhi

Updated On : April 1, 2022 / 10:43 AM IST

Eil Jobs : భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూదిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన , ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. స్ట్రక్చరల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ తదితర విభాగాల్లో జూనియర్ డ్రాప్ట్స్ మెన్లు ఖాళీలను ఈనోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 01,2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరితేదిగా ఏప్రిల్ 18, 2022 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://engineersindia.com/ సంప్రదించగరలు.