Jobs : హైదరాబాద్ ఐఐటీలో ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా పోస్టుల్ని అనుసరించి సంబంధింత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ , ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సారాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Jobs : హైదరాబాద్ ఐఐటీలో ఖాళీల భర్తీ

Iit Hyderabad

Jobs : భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. విభాగాల వారిగా పోస్టుల వివరాలకు సంబంధించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ తదితర విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేపట్టున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా పోస్టుల్ని అనుసరించి సంబంధింత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ , ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సారాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 1,01,500రూ నుండి 1,59,100రూ వేతనంగా అందజేస్తారు.

అభ్యర్ధుల ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంటర్య్వూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహింస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను అన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 15, 2022ను చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://iith.ac.in/సంప్రదించగలరు.