ESIC Recruitment : ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లో ఒప్పంద ఖాళీల భర్తీ

అభ్యర్ధుల వయసు 69 ఏళ్లకు మించరాదు. ఎంపికైన వారికి నెలకు రూ.1,30,797ల నుంచి రూ.1,52,241ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 2, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ESIC Recruitment : ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లో ఒప్పంద ఖాళీల భర్తీ

Filling up of contractual vacancies in Employees State Insurance Corporation

Updated On : November 17, 2022 / 9:02 PM IST

ESIC Recruitment : భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, అనెస్తీషియా, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్‌ అనాటమీ, ఆరల్‌ అండ్‌ మ్యాక్సిలోఫేషియల్‌ సర్జరీ, కన్జర్వీటివ్‌ డెంటిస్ట్రీ తదితర తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్‌డీ/ఎమ్‌ఎస్‌/డీఎన్బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

అభ్యర్ధుల వయసు 69 ఏళ్లకు మించరాదు. ఎంపికైన వారికి నెలకు రూ.1,30,797ల నుంచి రూ.1,52,241ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 2, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; చిరునామా: ది డీన్, ESIC డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సెక్టార్-15, రోహిణి, న్యూఢిల్లీ-110089. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.esic.in/ పరిశీలించగలరు.