IBPS RRB Notification : రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ
కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ) పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను ఐబీపీఎస్ భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు.

Job Vacancies in Regional Rural Banks
IBPS RRB Notification : భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సంస్ధ పలు ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,594 క్లర్క్, పీఓ, ఆఫీసర్స్ స్కేల్ II, III స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Fast Spoiling Foods : బయట ఉంచినప్పుడు త్వరగా చెడిపోయే ఆహారాలు !
కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ) పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను ఐబీపీఎస్ భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల వారిగా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 21, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే జనరల్,ఓబీసీ అభ్యర్ధులకు రూ.850లు, ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,ఈడబ్ల్యూఎస్,మహిళా అభ్యర్ధులు రూ.175లు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ibps.in/ పరిశీలించగలరు.