Jobs in Abroad: డిగ్రీ లేకుండానే విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన.. ఈ స్కిల్స్ ఉంటే చాలు

Jobs in Abroad: స్కిల్ బేస్డ్ జాబ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇలాంటి జాబ్స్ మంది ఆదరణ, ఆదాయం ఉంది.

Jobs in Abroad: డిగ్రీ లేకుండానే విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన.. ఈ స్కిల్స్ ఉంటే చాలు

Updated On : June 21, 2025 / 12:31 PM IST

చాలా మంది చదువుతోనే మంచి జీతం, జీవితం అనుకుంటారు. అది ఒకప్పటిమాట. ఇప్పుడు చదువు లేకుండా కూడా ఎంతో మంది జీవితంలో సక్సెస్ అవుతున్నారు.. లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు చదువుతో కాకుండా స్కిల్ బేస్డ్ జాబ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇలాంటి జాబ్స్ మంది ఆదరణ, ఆదాయం ఉంది. మరి ఆ జాబ్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆక్యుపేషనల్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌: వీళ్ళు ఏదైనా కంపెనీలో వర్క్ ప్లేసెస్‌ని సేఫ్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా చూడాలి. కంపెనీలు తప్పకుండా సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారా లేదా అని చూడాలి పాటించేలా చేయాలి. వీరికి సంవత్సరానికి దాదాపు రూ.52,00,000 వరకు ఆదాయం ఉంటుంది.

స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్: వీళ్ళు సినిమాలు, టీవీ షోలు, వీడియో గేమ్‌లలో విజువల్స్‌ను క్రియేట్‌ చేస్తారు. దీనికి కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. చదువుతో సంబంధం లేకుండా ఏడాదికి సుమారు రూ.54,00,000లక్షల వరకు సంపాదించవచ్చు.

కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌వైజర్‌: పెద్ద లేదా చిన్న బిల్డింగ్‌ ప్రాజెక్టులకు అక్కడ జరిగే పనులకు బాధ్యత వహిస్తారు. ఏ పని చేయాలనీ ప్లాన్ చేస్తారు, టీమ్స్ మేనేజ్‌ చేస్తారు. ప్రతీ పని షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా ప్లాన్‌ చేస్తారు. వీరికి సంవత్సరానికి రూ.49,00,000 వరకు జీతం అందుతుంది. అది కూడా ఎలాంటి చదువు లేకుండానే.

ఇన్సూరెన్స్‌ అప్రైజర్‌: వీళ్ళు ఇన్సూరెన్స్‌ కంపెనీల కోసం ఇళ్ళు, కార్లు, ఇతర ప్రాపర్టీల వ్యాల్యూని చెక్‌ చేస్తూ ఉంటారు. డ్యామేజ్‌ని చెక్ చేస్తారు. మార్కెట్ వ్యాల్యూతో కంపేర్‌ చేసి ఆ ప్రాపర్టీ విలువ ఎంత అనేది నిర్ణయిస్తారు. దీనికి కూడా చదువు అవసరం లేదు. వీరికి రూ.49,50,000 వరకు జీతం ఉంటుంది.

అగ్రికల్చరల్‌ మేనేజర్‌: పొలాలు, పంటలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. పంట వేసినప్పటి నుండి కొత్త కోసే వరకు అన్ని పనులను భాద్యతగా చూసుకోవాలి. వీరికి సంవత్సరానికి రూ.53,50,000 వరకు శాలరీ వస్తుంది.

గ్యాస్ ప్లాంట్ ఆపరేటర్: వీళ్ళు విద్యుత్ లేదా గ్యాస్ ప్లాంట్లలో ఎక్విప్‌మెంట్‌ ఆపరేట్ చేస్తారు. మెషీన్లను చెక్‌ చేస్తూ సేఫ్టీ ప్రోటోకాల్స్‌ ఫాలో అవుతూ, ఆపరేషన్స్‌ స్మూత్‌గా జరిగేలా చేస్తారు. వీరికి సంవత్సరానికి రూ.53,00,000 వరకు ఆదాయం అందుతుంది.

సబ్‌వే ఆపరేటర్: వీళ్ళు రైళ్లను నడుపుతారు. కాబట్టి వీరికి ఎలాంటి చదువు అవసరం లేదు. కానీ, సంపాదన మాత్రం గట్టిగానే ఉంటుంది. వీరికి యావరేజ్‌ శాలరీ సంవత్సరానికి రూ.51,00,000 వరకు ఉంటుంది.

ఇలా చదువుతో సంబంధం లేకుండానే చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. అది కూడా విదేశాల్లో. అందుకే, చదువు ఒక్కటే జీవితం అనుకుంటే పొరబాటే అవుతుంది. మరి మీలో ఎవరైనా వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ట్రై చేయండి.