APPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు.. సిలబస్‌లో భారీ మార్పులు, 17ఏళ్ల ఆ పోస్టులు భర్తీ

గ్రూప్-2 సిలబస్ లో భారీ మార్పులు చేపడుతున్నట్లు వెల్లడించారు. APPSC - Group 1 Notification

APPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు.. సిలబస్‌లో భారీ మార్పులు, 17ఏళ్ల ఆ పోస్టులు భర్తీ

APPSC - Group 1 Notification (Photo : Google)

APPSC – Group 1 Notification : నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ లోపు మరో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అలాగే త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. కాగా, గ్రూప్-2 సిలబస్ లో భారీ మార్పులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Also Read..Group 1 Results 2023 : గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. మహిళలదే హవా, టాప్ -5 ర్యాంకర్స్ వీళ్లే

ఇక, 17ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు వివరించారు. ఇవాళ గ్రూప్ 1 తుది ఫలితాలను గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త నోటిఫికేషన్ల గురించి వివరాలు వెల్లడించారు.

గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ ఛైర్మన్
” త్వరలో 1,199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఇవి కాకుండా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తాం. సెప్టెంబర్ లోపు గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. త్వరలోనే గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ నూ విడుదల చేస్తాం. గ్రూప్-1 లో 100 పోస్టులు, గ్రూప్-2 లో వెయ్యి పోస్టులకుపైగా ఖాళీలు భర్తీ చేస్తాం. గ్రూప్స్ సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడతాం. నిరుద్యోగులు గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు. ఉద్యోగ నియామకాలపై వదంతులు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు”.