నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : గురుకులాల్లో 3 వేల పోస్టులు భర్తీ
తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే 3 వేల టీచింగ్, నాన్-నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ కు కసరత్తు చేస్తోంది.

తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే 3 వేల టీచింగ్, నాన్-నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ కు కసరత్తు చేస్తోంది.
తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే 3 వేల టీచింగ్, నాన్-నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ కు కసరత్తు చేస్తోంది. వీటి ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లోని పోస్టులతో పాటు.. గతంలో ప్రభుత్వం అనుమతించినా.. ప్రకటనలు వెలువడని పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీకానున్నాయి.
జోన్ల వారీగా పోస్టుల విభజనతో సంబంధం లేకుండా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల మేరకు ఉద్యోగ ప్రకటనలు వెలువరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సొసైటీల నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానం ప్రకారం 2200 ఖాళీల భర్తీకి పంపిన ప్రతిపాదనలకు గురుకుల నియామక బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిపింది.
వీటితోపాటు వివిధ సొసైటీల్లో ప్రకటనలు వెలువరించని పీఈటీ, పీజీటీ హిందీ, ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల సంఖ్య 600కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 3 వేల వరకు పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ ఆమోదమే తరువాయి.. ఈ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
పోస్టులు:
పీజీటీ – 1071
ప్రిన్సిపల్స్ – 119
లైబ్రేరియన్లు – 119
పీఈటీ – 119
జూనియర్ అసిస్టెంట్లు – 110
పీజీటీ హిందీ – 100
ఫిజికల్ డైరెక్టర్లు – 70