Group 2 Jobs : గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వయసు, విద్యార్హతలు ఇవే

ఈ నెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లయ్ చేసుకోవడానికి ఆఖరు తేదీ 2024 జనవరి 10.

Group 2 Jobs : గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వయసు, విద్యార్హతలు ఇవే

Group 2 Jobs (Photo : Google)

Updated On : December 21, 2023 / 12:13 AM IST

ఏపీలో గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను APPSC విడుదల చేసింది. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు విభాగాలుగా ఈ పోస్టులను విడదీశారు. అందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇందులో మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ ఎస్ఐ, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి స్కేల్ ఆఫ్ పే, వయసు, విద్యార్హతలు అన్నీ APPSC సైట్ లో పొందుపర్చారు. ఈ నెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లయ్ చేసుకోవడానికి ఆఖరు తేదీ 2024 జనవరి 10.

కొత్త సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Also Read : మీ ఆపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నారా? రాబోయే ఈ కొత్త అప్‌డేట్‌తో దొంగిలించిన డివైజ్ ఎవరూ అన్‌లాక్ చేయలేరు..!

ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ (APPSC) నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్‌ పరీక్షకు షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. మెయిన్‌ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మెయిన్‌ రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్‌ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్‌ మోడ్‌ (ఓఎంఆర్‌) ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి.

గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షను 2024 ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించనున్నారు. 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనిలో కొత్తగా సమాజ శాస్త్రం అనే అంశాన్ని చేర్చారు. ఒక్కో సెక్షన్ కు 30 మార్కులను కేటాయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కులు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారికి కంప్యూటర్ అర్హత తప్పనిసరి.

Also Read : డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం లక్ష రూపాయలు.. పూర్తి వివరాలు